పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:10 AM
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
తిరుమల, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు. ప్రతి ఏటా జూన్ మాసంలో పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు తన తల్లి పేరిట తిరుమలలో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. చిన్న పిల్లలు కూడా తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలన్నారు.
తిరుమలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతం
తిరుమలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి కొనియాడారు. దర్శన గణంకాలతో పాటు తిరుమలలో టీటీడీ భక్తులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించడం అద్భుతమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఆదేశాలతో అత్యాధునాతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను100 రోజుల్లోనే టీటీడీ ఏర్పాటు చేయడం హర్షణీయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం కేంద్ర మంత్రి తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి..
భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest AP News And Telugu News