Home » TDP
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు.
ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఆదోనిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టి చర్చకు అనుమతించాలని ఎంపీలు కోరారు.
‘నాకు మా యువ నాయకుడు, మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తి. ఆయన బాటలోనే నడుస్తా. ఎవరు ఎన్ని రాళ్లు విసిరినా రాటుదేలుతా’ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు.
కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పట్టించుకోని నేతలు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ శ్రేణులంతా క్రమశిక్షణతో పని చేయాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కష్టపడిన వారిని గుర్తించే పని మంత్రి నారా లోకేశ్ చూసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు.
ఎన్ని కష్టాలు వచ్చినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మెడపై కత్తిపెట్టి బెదిరించినా వెనక్కి మాత్రం తగ్గలేదని తెలిపారు.