Minister Nara Lokesh: ఆంధ్రజ్యోతి కథనంపై మంత్రి నారా లోకేశ్ స్పందన..
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:35 AM
అధికారులతో మాట్లాడి చిట్టితల్లిని.. కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: చిట్టితల్లి నిశ్చింతగా చదువుకో.. కేజీబీవీలో సీటు ఇప్పించే బాధ్యత నాది.. అంటూ ఓ చిన్నారికి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతిలో కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం ప్రచురితమైంది. ఇది చూసిన మంత్రి కథనంపై తన భావాలను వ్యక్తపరిచారు. జెస్సీ కథనం తనని కదిలించిందని ఆయన తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన ఆంధ్రజ్యోతికి అభినందనలు తెలిపారు.
అధికారులతో మాట్లాడి చిట్టితల్లిని.. కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు.. పత్తి చేనులో మగ్గిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు మంచి యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని చెప్పారు. బడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వివరించారు. పిల్లల భద్రత - భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదని సూచించారు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్