Share News

Nazir Slams Jagan: ఆ సీట్లు అమ్ముకున్నది మీరా మేమా.. జగన్‌పై నజీర్ మండిపాటు

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:39 PM

గడిచిన ఐదేళ్ళ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నది శుద్ధ అబద్దమని నజీర్ స్పష్టం చేశారు. వారి హయాంలో తీసుకు వచ్చినవి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అని... అవి కూడా 30 శాతం మాత్రమే నిర్మాణం చేపట్టారని వెల్లడించారు.

Nazir Slams Jagan: ఆ సీట్లు అమ్ముకున్నది మీరా మేమా.. జగన్‌పై నజీర్ మండిపాటు
Nazir Slams Jagan

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: ప్రజాస్వామ్యాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM Jagan Mohan Reddy) కూని చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు 28 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు. గడిచిన ఐదేళ్ళ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నది శుద్ధ అబద్దమని స్పష్టం చేశారు. వారి హయాంలో తీసుకు వచ్చినవి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే అని... అవి కూడా 30 శాతం మాత్రమే నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. వాటిలో ఎటువంటి టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ కనీస సౌకర్యాలు కల్పించ లేదని వ్యాఖ్యలు చేశారు.


ఏ ఏ జీవోల ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ విద్యార్థులు 15000 రూపాయల కట్టి చదువుకునే మెడికల్ సీట్లను లక్షలలో అమ్ముకున్నది జగన్ అంటూ నజీర్ ఫైర్ అయ్యారు. మెడికల్ సీట్లు అమ్ముకున్నది.. మీరా మేమా జగన్ అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందిని ఆదుకుంటున్నది టీడీపీ పార్టీ అని వెల్లడించారు. ‘నీ పేరు మీద ఒక్క ట్రస్ట్ అయినా ఉందా.. ఒకరికి అయినా నీ జీవితంలో సహాయపడ్డావా... వైద్య వృత్తి వ్యవస్థనే నాశనం చేశావ్. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. నీకు, నీ నాయకత్వానికి సబ్జెక్ట్ లేదు’ అంటూ ఫైర్ అయ్యారు. పేదల పక్షపాతి చంద్రబాబు అని స్పష్టం చేశారు. పేద మెడికల్ విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసింది జగన్ అని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మేసినవాడు మాజీ సీఎం జగన్ అంటూ మహమ్మద్ నజీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి

చలో మెడికల్ కాలేజ్...పోలీసుల వైఖరి.. పేర్నినాని రియాక్షన్

నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 01:48 PM