Perni Nani Fire On Police: చలో మెడికల్ కాలేజ్...పోలీసుల వైఖరి.. పేర్నినాని రియాక్షన్
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:23 AM
రాష్ట్ర చరిత్ర లో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసు నమోదు చేయడం.. ఆ కేసులో 10 సంవత్సరాల శిక్షకు సంబంధించిన సెక్షన్ కూడా వేసి బెయిల్ రాకుండా మీరు చేసే ప్రయత్నం ఎక్కడా చూడలేదని పేర్నినాని విమర్శించారు.
కృష్ణా జిల్లా,సెప్టెంబర్ 20: వైసీపీ చేపట్టిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో పోలీసుల వైఖరి పట్ల మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ చర్యలు స్వాగతిస్తున్నామన్నారు. రూల్ మైండ్‌తో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ అందరి విషయంలో ఒకేలా చట్టాన్ని అమలు అయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్ర చరిత్ర లో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసు నమోదు చేయడం.. ఆ కేసులో 10 సంవత్సరాల శిక్షకు సంబంధించిన సెక్షన్ కూడా వేసి బెయిల్ రాకుండా మీరు చేసే ప్రయత్నం ఎక్కడా చూడలేదని విమర్శించారు. లోపలికి పంపితే గర్వంగా వెళ్తామని తామేమీ హత్యలు చేసి వెళ్లడంలేదన్నారు.
ప్రజల పక్షాన్న నిలిచి పోరాడుతూ ఆ క్రమంలో వెళ్లడంతో తప్పు లేదని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. అయినా 365 రోజుకు ఎక్కడా లేని విధంగా ఆర్టికల్ 30 పెట్టడం చూస్తుంటే దారుణంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. ‘మీపై డీజీపీ, హోమ్ మినిస్టర్ ఒత్తిడి చేసి ఉండొచ్చు, ప్రతిపక్షాల నోరు ఎత్తనివ్వకుండా చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటు. మచిలీపట్నంలోని జనసేన, టీడీపీలోని కొందరు గుండాలు , రౌడీలు చట్టాని అతిక్రమిస్తున్నారు. వారిపై కూడా ఇలాగే చర్యలు తీసుకోండి. పాత ఎస్పీలా కాకుండా కూటమి ప్రభుత్వానికి ఏకంపక్షంగా వ్యవహరిస్తున్న ఆయా పోలీస్ అధికారులను సైతం గుర్తించండి’ అంటూ మాజీ మంత్రి పేర్నినాని పేర్కొన్నారు
ఇవి కూడా చదవండి
నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
Read Latest AP News And Telugu News