MLA: మా ప్రాంతం.. పరిశ్రమలకు అనుకూలం
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:37 PM
పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసత్యసాయి జిల్లా అనుకూలమైన ప్రాంతమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి పుష్కలంగా ఉందన్నారు.
- అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి
పుట్టపర్తి(అనంతపురం): పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసత్యసాయి జిల్లా అనుకూలమైన ప్రాంతమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి పుష్కలంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని కప్పలబండ ఇండస్ర్టియల్ పార్కులో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారు? ఎంతమందికి అనుమతులు ఇచ్చారు? ఎంత భూమి మిగిలి ఉందో సంబంధితశాఖామంత్రి తెలపాలని ఎమ్మెల్యే కోరారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు మహిళలకు ఎలాంటి రాయితీలు కల్పించే అవకాశం ఉందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 2008-2009లో అమడగూరు ప్రాంతంలో రూ.లక్ష కోట్లతో 60 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా సైన్సుసిటీ ఏర్పాటు చేస్తామని 402 ఎకరాలు భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించిందన్నారు.

ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఈప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖామంత్రిని ఎమ్మెల్యే కోరారు. జిల్లా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో పాటు భూముల లభ్యత, ధర చౌకగా ఉన్నట్లు వివరించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న శ్రీసత్యసాయి జిల్లాలో పరిశ్రమలు ఏమైనా స్థాపించే అవకాశాలుఉన్నాయా అని సంబంధిత మంత్రిని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News