Home » TDP - Janasena
ఏపీలో భవిష్యత్తులో.. ఎయిర్‌పోర్ట్స్, పోర్టులు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి 50 కిలోమీటర్స్‌కి ఒక పోర్ట్.. నిర్మించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో చాలా స్ట్రాంగ్‌గా ఉందని వివరించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబుకి తెలుగు రాష్ట్రాలనుంచే కాక, దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మీటింగ్‌కు తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ మెరిట్ లిస్టు వచ్చేసింది. రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807టీచర్ పోస్టులకు నోటిఫికేషన ఇచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 147, ఎస్జీటీ కన్నడ 07, ఎస్జీటీ ఉర్దూ 48 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లలో తెలుగు 28, ఉర్దూ 9, హిందీ 28, ఇంగ్లిష్ 103, గణితం 43, ఫిజికల్ సైన్స 66, బయాలజికల్ సైన్స 72, సోషియల్ 110, సోషియల్ ఉర్దూ 1, ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ)145 ఉన్నాయి. ఈ పోస్టులకు 45,186 మంది పరీక్షలు రాశా...
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పేరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని జగన్‌ను రాజ్‌నాథ్ కోరారు.
సీపీ రాధాకృష్ణన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
నిందితుడి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని తన వద్ద నుంచి 22 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రకాష్‌పై ఈస్ట్ గోదావరి, ఏలూరు, నెల్లూరులో పలు గంజాయి కేసులు నమోదు అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడంతో మహిళలకు నిజమైన పండుగ వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని శుక్రవారం ప్రారంభించడంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో ఆర్థిక శాఖ మంత్రి జెండా ఊపి, పథకాన్ని ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆర్టీసీ అధికారులు పథకాన్ని ...