Share News

Minister Savita: కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ..

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:54 PM

రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చేనేత బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోందని మంత్రి సవిత తెలిపారు. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టిందని చెప్పుకొచ్చారు.

Minister Savita: కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో.. మరో కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ.. మేరకు త్వరలో.. చేనేత వస్త్రాలు ఇంటి ముందుకు రానున్నాయని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో చేనేతకు మహర్దశ ప్రారంభమైందని అన్నారు. నేతన్నల అభివృద్ధికి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు చేనేత ఉత్పత్తులకు మార్కెంటింగ్ ప్రభుత్వం సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు..


రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోందని మంత్రి సవిత తెలిపారు. అదే సమయంలో ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. ఈ మేరకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభించిందని స్పష్టం చేసింది.

నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్‌‌లతో పాటు ఆన్‌‌లైన్‌‌లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని వివరించారు. యువత, మహిళ, చిన్న పిల్లలు... ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉంచిందని వెల్లడించారు. రోజు రోజుకూ చేనేత వస్త్రాల వినియోగం పెరుగుతుందని అన్నారు. నేతన్నలకు 365 రోజుల ఉపాధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 03 , 2025 | 09:31 PM