Share News

గురుతరం

ABN , Publish Date - Aug 24 , 2025 | 12:52 AM

మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్టు వచ్చేసింది. రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన ఇచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 147, ఎస్జీటీ కన్నడ 07, ఎస్జీటీ ఉర్దూ 48 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లలో తెలుగు 28, ఉర్దూ 9, హిందీ 28, ఇంగ్లిష్‌ 103, గణితం 43, ఫిజికల్‌ సైన్స 66, బయాలజికల్‌ సైన్స 72, సోషియల్‌ 110, సోషియల్‌ ఉర్దూ 1, ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ)145 ఉన్నాయి. ఈ పోస్టులకు 45,186 మంది పరీక్షలు రాశా...

గురుతరం

మార్కులతో డీఎస్సీ ఫలితాలు విడుదల

అర్హులైన అభ్యర్థుల ఫోనలకు మెసేజ్‌లు

ఉమ్మడి జిల్లాలో భర్తీ కానున్న 807 టీచర్‌ పోస్టులు

అనంతపురం విద్య, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్టు వచ్చేసింది. రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం రాత్రి అధికారికంగా విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 807టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన ఇచ్చారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 147, ఎస్జీటీ కన్నడ 07, ఎస్జీటీ ఉర్దూ 48 పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్లలో తెలుగు 28, ఉర్దూ 9, హిందీ 28, ఇంగ్లిష్‌ 103, గణితం 43, ఫిజికల్‌ సైన్స 66, బయాలజికల్‌ సైన్స 72, సోషియల్‌ 110, సోషియల్‌ ఉర్దూ 1, ఫిజికల్‌ డైరెక్టర్లు(పీడీ)145 ఉన్నాయి. ఈ పోస్టులకు 45,186 మంది పరీక్షలు రాశారు. ప్రస్తుతం డీఎస్సీ మెరిట్‌ లిస్టు వి డుదల చేయడంతో ఎవరు ఏ సబ్జెక్టులో టాపరో,


ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసి పోయింది. అలాగే అభ్యర్థులు కటాఫ్‌ ఎంతకు ఉంటుందనే విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు.

రేపు సర్టిఫికెట్ల వెరిఫికేషన

మెరిట్‌, రోస్టర్‌ ఆధారంగా టీచర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫోనలకు రాష్ట్ర విద్యాశాఖ సమాచారం పంపింది. ఈ సమాచారం వచ్చిన అభ్యర్థులందరికీ సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన చేపట్టనున్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ నగరంలోని ఆలమూరు రోడ్డు నందు గల పీవీకేకే ఎంబీఏ కళాశాలలో ఏర్పాట్లు చేసింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 16 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో మగ్గురు సభ్యులు ఉంటారు. సర్టిఫికెట్ల వెరిఫికేషనకు వచ్చే అభ్యర్థులు, వారివెంట వచ్చే పేరెంట్స్‌ కోసం 32 గదుల్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

అమరేష్‌.. అదుర్స్‌..!

కష్టే ఫలి అనే నానుడికి జిల్లా టాప్‌ ర్యాంకర్‌ అమరేష్‌ నిదర్శనంగా నిలిచారు. తొలిసారి ఉద్యోగం రాలేదని కుంగిపోకుండా మరింత కసితో చదివారు. ఈ క్రమంలో డీఎస్సీ- 2025లో 88.89 మార్కులు సాధించి, సోషియల్‌ అసిస్టెంట్‌ విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన నారాయణ, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు పలమాసి అమరేష్‌. 2018లో జరిగిన డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టుకు పరీక్షలు రాశారు. అప్పుడు ఎంపిక కాలేకపోయారు. అయినా నిరాశ చెందలేదు. మరింత కసితో కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లి శిక్షణ పొంది, పరీక్షలకు సిద్ధమై విజయం సాధించారు. జిల్లా టాపర్‌గా, రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకర్‌గా అమరేష్‌ నిలవడంతో ఆయన కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Updated Date - Aug 24 , 2025 | 12:52 AM