AP News: ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, గోదావరి నదులు.. హెచ్చరికలు జారీ..
ABN , Publish Date - Aug 20 , 2025 | 07:37 AM
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పేరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జలమయం అయింది. జన జీవనం స్తంభించిపోయింది. రహదారులన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలిపిస్తున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు, వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పేరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా గోదావరి ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 42.2అడుగులగా ఉందన్నారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు వివరించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయినట్లు తెలియజేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. SDRF బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వరద ఉద్ధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఎండీ ప్రఖర్ జైన్ సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి