Share News

Pawan Kalyan On Vinayaka Chavithi: మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడండి..

ABN , Publish Date - Aug 27 , 2025 | 07:45 AM

ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan On Vinayaka Chavithi: మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడండి..

అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైందవ పండుగలలో కొన్నిటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని.. ఒక్క వినాయక చవితి మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని తెలిపారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ శుభ తరుణానా గణనాథుడిని భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. వినాయక చవితి విశిష్టతను చెప్పుకొచ్చారు.


ప్రజలు తలపెట్టే అన్ని శుభకార్యాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. మట్టి వినాయకులను పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య గణేశుడిని పూజిస్తున్న భక్తులకు సకల శుభాలు కలగాలని వినాయకుడిని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Updated Date - Aug 27 , 2025 | 07:46 AM