Home » Tamil Nadu
పెళ్లిపీటలెక్కాల్సిన ఓ యువతి బాత్రూమ్‌లో అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు సమీపంలోని అత్తిమాంజేరిపేటలో చోటుచేసుకుంది.
అనుమానం పెనుభూతమైంది.. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. తన ఇద్దరు పిల్లలను హతమార్చి, తనూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపం తెల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.
వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పొత్తు గురించి సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చర్చలు జరపలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వెల్లడించారు.
రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోంందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆరోపించారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో నవంబరు 3వ తేది వరకు మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తీవ్ర తుఫానుగా మారి కాకినాడ సమీపంలో తీరం దాటిందన్నారు.
కరూర్ రోడ్‌షోలో 41 మంది దుర్మరణం సంఘటన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ మళ్ళీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల కరూర్ మృతుల కుటుంబ సభ్యులను మహాబలిపురం రిసార్ట్‌కు రప్పించి వారికి క్షమాపణ చెప్పి, గాయపడిన వారికి తలా రూ.2లక్షలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కరూర్ తొక్కిసలాటకు ముందే తమ పార్టీ ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనాలు, ప్రస్తుతం ముంథా తుఫాన్ కారణంగా నగరంలో పక్షం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం 6 నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (32 గంటలపాటు) నగరం, శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది.