Tamil Nadu: హోసూరు.. వణికిపోతోంది..
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:56 PM
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- వణికిస్తున్న చలి
- కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదు
హోసూరు(తమిళనాడు): ప్రతి సంవత్సరం హోసూరు(Hosuru) ప్రాంతంలో నవంబరు, డిసెంబరు నెలల్లో తీవ్రమైన చలి ఉంటుంది. భారీ వర్షాల కారణంగా, చలి ప్రభావం సాధారణం కంటే ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితిలో తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని వివిధ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ గత 3 రోజులుగా హోసూరు ప్రాంతంలో కూడా చాలా చల్లని ప్రాంతంగా మారిపోయింది. శుక్రవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 16.3 డిగ్రీలు ఉష్ణోగ్రత సెల్సియ్‌సగా నమోదైంది.

అదేవిధంగా పగటివేళ సగటు ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియ్‌సగా మధ్యాహ్నం 23 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ట తేమ వాతావరణం 87.5 శాతంగా ఉంది. చలి తీవ్రతమకు వృద్ధులు మాత్రం బయటకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమయ్యారు. బడికి వెళ్లే చిన్న పిల్లలు, విద్యార్థులు స్వెటర్లు ధరించి వెళ్తున్నారు. కర్మాగారాలకు వెళ్లే స్త్రీలు, పురుషులు స్వెటర్లు ధరించి రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్
Read Latest Telangana News and National News