Share News

Student: పెంచిన ఆవు మృతి చెందిందని...

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:53 AM

పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్‌కుమార్‌ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే... రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Student: పెంచిన ఆవు మృతి చెందిందని...

- విద్యార్థి ఆత్మహత్య

చెన్నై: ప్రేమతో పెంచుకున్న ఆవు మృతిచెందడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మైలిఇలుపకుళం గ్రామానికి చెందిన పాండి కుమారుడు సెంథిల్‌కుమార్‌ (18) ప్రభుత్వ ఐటీఐలో మెకానికల్‌ చదువుతున్నాడు. అతనికి ప్రతినెలా వస్తున్న స్కాలర్‌ షిప్‌ను పొదుపుచేసి ‘సెమ్మరి’ ఆవును కొనుగోలు చేసి సంరక్షిస్తున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఆవు మృతిచెందింది. తాను ప్రేమగా పెంచుకున్న ఆవు మృతిచెందడంతో సెంథిల్‌కుమార్‌ తీవ్ర మనస్తాపం చెందాడు.


nani2.2.jpg

ఘటన జరిగిన రోజున సెంథిల్‌కుమార్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విరుదునగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సలకు మదురై ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు ఫలించక సెంథిల్‌ కుమార్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై నరికుడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


nani2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 11:53 AM