Tiruchendur Temple Elephant Incident: తండ్రిని చంపిన ఏనుగును.. ఆ పిల్లలు ఏం చేశారంటే..
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:57 AM
తమ తండ్రిని చంపిన ఆలయ ఏనుగును చూసి మావటి కుమార్తెలు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి జ్ఞాపకార్థం వారు ఏనుగుకు నైవేద్యంగా సమర్పించి..
ఇంటర్నెట్ డెస్క్: తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గత సంవత్సరం చోటుచేసుకున్న ఏనుగు దాడి ఘటన అందరినీ కలచివేసింది. ఆలయంలోని దేవనై అనే 26 ఏళ్ల ఏనుగు అకస్మాత్తుగా దాడి చేయడంతో ప్రమాదంలో ఏనుగు సంరక్షకుడు ఉదయకుమార్, అతని బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అప్పట్లో ఆలయ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ దుర్ఘటన జరిగి నేటితో సంవత్సరం కావడంతో ఉదయకుమార్ కుమార్తెలు అక్షర, అకల్యా తిరుచెందూర్ ఆలయానికి వచ్చారు. వారు తమ తండ్రి సంరక్షణలో ఉన్న అదే ఏనుగు దేవనైను చూసి భావోద్వేగం చెందారు.

ఏనుగుకు నైవేద్యం
తండ్రి జ్ఞాపకార్థం వారు ఏనుగుకు పుచ్చకాయ, పనస, చెరకు, మామిడి, ఆపిల్, నారింజ వంటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఏనుగు దేవనై ఆనందంగా పండ్లు తీసుకుని, తన తొండంతో వారిని సున్నితంగా తాకి ప్రేమను వ్యక్తం చేసిన ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.

ఆశీర్వాదం
ఏనుగు తన తొండం, కాలు పైకెత్తి పిల్లలకు ఆశీర్వాదం తెలిపింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని భావోద్వేగానికి గురి చేశాయి. తమ తండ్రిని కోల్పోయిన ఈ పిల్లలు, ఆయన సేవ చేసిన ఏనుగును చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read:
వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు
వాటర్ బాటిల్ నీటికి ఎక్స్‌పైరీ డేట్.. తర్వాత తాగితే ఏం జరుగుతుంది..
For More Latest News