• Home » Tadipatri

Tadipatri

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌

మండలంలో భారీగా కేబుల్‌ చోరీలకు పాల్పడిని నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషనలో విలేకరుల సమావేశనం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

JCPR: రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన

JCPR: రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన

పట్టణంలోని రుద్రభూమిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్‌ రోడ్లు, కాలభైరవస్వామి విగ్రహం, వసతి గదుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.

MLA: ఒకటో తేది అంటే ఆనందం

MLA: ఒకటో తేది అంటే ఆనందం

పట్టణంలోని శ్రీరాములపేటలో సోమవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పింఛనల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటోతేది అంటే ఆనందం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

RAIN: గాలివాన బీభత్సం

RAIN: గాలివాన బీభత్సం

పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్‌, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

RALLY: ఉద్యోగి మృతికి సంతాప ర్యాలీ

RALLY: ఉద్యోగి మృతికి సంతాప ర్యాలీ

అనారోగ్యంతో మృతి చెందిన పట్టణంలోని వార్డు సచివాలయం అనిల్‌కుమార్‌ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపాటిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం అనిల్‌కుమార్‌ మృతికి సంతాపంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు.

CRICKET: విజేత రాయలచెరువు జట్టు

CRICKET: విజేత రాయలచెరువు జట్టు

మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.

CAT: వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి

CAT: వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి

మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు.

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్‌చల్‌ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు.

JCPR: కొట్టాలపల్లిలో జేసీపీఆర్‌ పర్యటన

JCPR: కొట్టాలపల్లిలో జేసీపీఆర్‌ పర్యటన

మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.

SCHOOL: ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి

SCHOOL: ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి