Share News

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

ABN , Publish Date - May 25 , 2026 | 12:01 AM

మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్‌చల్‌ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు.

HUSTLING: మద్యం మత్తులో కేరళవాసి హల్‌చల్‌

యాడికి, మే 24 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఉన్న కేరళవాసి సంచారజాతుల వారు నివాసం ఉండే గుడారాల్లోకి దూరి హల్‌చల్‌ చేశాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అ ప్పగించారు. శనివారం రాత్రి మ ద్యం మత్తులో ఉన్న కేరళవాసి యాడికిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కొ త్త భాషలో మాట్లాడుతుండడంపై సా ్థనికులు అతడిని దొంగగా అనుమానించారు. అతడు అక్కడక్కడ తిరుగుతూ తిప్పారెడ్డిపల్లి రోడ్డులో నివాసం ఉండే సంచార జాతుల వారి గుడారాల్లోకి వెళ్లి హల్‌చల్‌ సృష్టించాడు. ఒక బాలుడిని పట్టుకొని వెళుతున్నట్లు స్థానికులు గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న కేరళవాసి మాట్లాడే భాష అర్థంకాక, అతడి ప్రవర్తనతో విసుగు చెందిన స్థానికులు ఆగ్రహంతో రాళ్లు రు వ్వారు. అతడు కూడా రాళ్లు రువ్వాడు. స్థానికులు అతడిని పట్టుకొని చేతు లు కట్టేసి, దేహశుద్ధిచేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘట నా ప్రదేశానికి పోలీసులు వచ్చి కేరళవాసిని పోలీ్‌సస్టేషనకు తీసుకువెళ్లారు. అతడు ఆదివారం కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతడి నుంచి వివరాలు రాబట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 25 , 2026 | 12:01 AM