Share News

JCPR: కొట్టాలపల్లిలో జేసీపీఆర్‌ పర్యటన

ABN , Publish Date - May 24 , 2026 | 11:55 PM

మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు.

JCPR: కొట్టాలపల్లిలో జేసీపీఆర్‌ పర్యటన
A former MLA who inquires about the problems with the villagers

పెద్దపప్పూరు, మే24(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొట్టాలపల్లిలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి, గ్రామంలో పలు సమస్యలపై ఆరాతీశారు. తాగునీరు వృథా చేయరాదని గ్రామస్థులకు సూచించారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తెస్తే వీలైనంత త్వర లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఎస్వీ రవీంద్రా రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రఘునాథ్‌ నాయుడు, భానుప్రకాష్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 11:55 PM