Share News

RAIN: గాలివాన బీభత్సం

ABN , Publish Date - May 31 , 2026 | 01:06 AM

పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్‌, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.

RAIN: గాలివాన బీభత్సం
Standing water at the vegetable market in Tadipatri

తాడిపత్రి, మే 30(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిసర ప్రాంతాల్లో శని వారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంక్‌ సమీపంలో, నాగులకట్ట, కూరగాయల మార్కెట్‌, యల్లనూరు రోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, హరిజన వాడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల చెట్లు, విద్యుతస్తంభాలు నేలకొరిగాయి. దీంతో రాత్రి 9గంటలు అవుతున్నా విద్యుత రాక పట్టణమంతా అంధకారంలో ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పెద్దపప్పూరు: మండలంలోని వరదాయపల్లి, ముచ్చుకోట, చిక్కేప ల్లి, నామనాంకపల్లి గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలివానకు అరటి, మొక్కజొన్న తోటలు నేలకొరిగాయి. ప్రస్తుతం రెండో కోతదశలో ఉన్న పంటలు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 31 , 2026 | 01:06 AM