JCPR: రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన
ABN , Publish Date - Jun 02 , 2026 | 11:42 PM
పట్టణంలోని రుద్రభూమిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవస్వామి విగ్రహం, వసతి గదుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.
తాడిపత్రి, జూన 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రుద్రభూమిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనులు వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవస్వామి విగ్రహం, వసతి గదుల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. గ్రీనరీ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించి, రెండునెలల వ్యవధిలో మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులను ఆదేశించారు. రుద్రభూమి అభివృద్ధికి సుమారు రూ. 2కోట్ల సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ప్రత్యేక చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం రుద్రభూమి ఆధునిక సౌక ర్యాలతో ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని నవరంగ్‌టాకీస్‌రోడ్డు, పోలీస్ స్టేషన సర్కిల్, సీబీరోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. దుకాణాల యజమానులు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్వీ రవీంద్రారెడ్డి, హరినాథ్‌రెడ్డి, పవనకుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, శివారెడ్డి ఉన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...