RALLY: ఉద్యోగి మృతికి సంతాప ర్యాలీ
ABN , Publish Date - May 26 , 2026 | 11:51 PM
అనారోగ్యంతో మృతి చెందిన పట్టణంలోని వార్డు సచివాలయం అనిల్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపాటిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం అనిల్‌కుమార్ మృతికి సంతాపంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు.
తాడిపత్రి, మే26(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మృతి చెందిన పట్టణంలోని వార్డు సచివాలయం అనిల్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని మున్సిపాటిటీ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కోరారు. వారు మంగళవారం అనిల్‌కుమార్ మృతికి సంతాపంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగి మృతిపట్ల ఆయన సంతాపం ప్రకటించారు. ఉద్యోగి మృతిపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఆ కుటుంబానికి ఏవిధమైన న్యాయం చేయాలన్నా తన సహా య సహకారాలు అందిస్తానని ఆయన హామీఇచ్చారు. కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చేటట్లు చూస్తానన్నారు. అక్కడి నుంచి ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయానికి ర్యాలీగా కమిషనర్‌ను కలవ డానికి వెళ్లారు. కమిషనర్ అక్కడ లేకపోవడంతో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఉద్యోగి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వచ్చిన కమిషనర్‌ను కలవ డానికి వారు ప్రయత్నించారు. ఆయన కార్యాలయం నుంచి బయటకు రాకపోగా కొద్దిసేపు ఉండమని సూచించాడు. అరగంట వేచి చూసినా ఆయన రాకపోవడంతో వారు వెంట తెచ్చుకున్న అర్జీని తపాలాపెట్టెలో వేసి వెనుదిరిగి వెళ్లారు. కనీసం తోటి ఉద్యోగి చనిపోతే సంతాప సభ నిర్వహించకుండా, వచ్చిన వారిని పలకరించకుండా లోపలకు వెళ్లి కూర్చోవడం ఏమిటని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కింది ఉద్యోగులంటే ఇంత చిన్నచూపా అని మండి పడ్డారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....