Share News

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:59 PM

మండలంలో భారీగా కేబుల్‌ చోరీలకు పాల్పడిని నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషనలో విలేకరుల సమావేశనం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

CABLE: కేబుల్‌ చోరీ నిందితుల అరెస్ట్‌
ASP revealing the details of the arrest

పెద్దపప్పూరు, జూన 2(ఆంధ్రజ్యోతి): మండలంలో భారీగా కేబుల్‌ చోరీలకు పాల్పడిని నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషనలో విలేకరుల సమావేశనం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, శింగనగుట్టపల్లి, చిక్కేపల్లి తదితర గ్రామాల్లో వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ చోరీలు విప రీతంగా జరిగాయి. శింగనగుట్టపల్లికి చెందిన జయరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన కేబుల్‌ను విక్రయిం చేందుకు నిందితులు మంగళవారం తరలిస్తుం డగా, అందిన సమాచారం మేరకు ఏఎస్పీ రోహితకుమార్‌ చౌదరి పర్య వేక్షణలో పోలీసులు వారిని మండలంలోని ముచ్చుకోట గ్రామం సచి వాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు.. వారివద్ద నుంచి రూ. రెండు లక్షల విలువైన 800మీటర్ల వ్యవసాయ కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తర లించినట్లు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ ఉమాశంకర్‌, హోంగార్డు సిద్ధిబా షాను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ తోటల్లో విలువైన పరికరాల వద్ద సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఏఎస్‌ఐ మహదేవ్‌, విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం...

Updated Date - Jun 02 , 2026 | 11:59 PM