Share News

SCHOOL: ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి

ABN , Publish Date - May 24 , 2026 | 11:51 PM

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు.

SCHOOL: ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
The MEOs in the campaign were Kasappa, Seetharamanjaneyu and teachers

- 47 కమిటీలతో విస్తృతంగా ప్రచారం

యాడికి, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు, ఉపాధ్యాయులు విస్తృత ప్రచా రం నిర్వహిస్తున్నారు. అయితే పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక పా ఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తిప్పారెడ్డిపల్లి, కొట్టాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు. అదే విధం గా రామరాజుపల్లిలో ఆరుగురు, నిట్టూరు(రోడ్‌) పాఠశాల, యాడికి నెం బర్‌-2 పాఠశాలల్లో ఏడుగురు చొప్పున, చిక్కేపల్లి, భోగాలకట్టలో తొమ్మి ది మంది చొప్పున విద్యార్థులున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులు లేకపో వడంతో మండలంలోని కుందనకోట, వీరారెడ్డిపల్లి, తిరుణాంపల్లి, పెం డేకల్లు, పుప్పాలతండాల్లోని ప్రాథమిక పాఠ శాలలు గతంలోనే మూత పడ్డాయి. అయితే ఆయా గ్రామాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు రూ.వేలకు వేలు ఫీజులు కట్టి కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలలకు వెళుతున్నారు. మరి వారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందు కు చేరడం లేదో అర్థంకాని విషయం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతోనైనా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అధికారులు గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

47 కమిటీల ఏర్పాటు

మండలంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 47కమిటీలను ఏర్పా టుచేశారు. మండలంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో 5895మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల మోసపూరిత ప్రకటనలతో మోసపోవ ద్దని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతూ ఈ కమి టీలు ప్రచారం సాగిస్తున్నాయి.


అయితే అలా ప్రచారానికి వెళుతున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి చుక్కె దురవుతోంది. మీ పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారు సార్‌ అంటూ ప్రశ్నిస్తుండడంతో, ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక ఉపా ధ్యాయులు పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది.

ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు

తమ పిల్లలను ప్రభుత్వ పా ఠశాలల్లో చదివిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపా ధ్యాయులు నరసింహారెడ్డి, విజ యలక్ష్మి దంపతులు. నరసిం హారెడ్డి బొమ్మనహాల్‌ మండ లంలోని దేవగిరి ఉన్నత పాఠ శాలలో ఫిజికల్‌ సైన్స ఉపా ధ్యాయుడు. ఆయన భార్య వి జయలక్ష్మి యాడికి మండలం కోనుప్పలపాడు ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు. వీరు తమ కుమారుడు ఈశాంతను ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ఈశాంత ప్రస్తు తం దేవగిరి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి. కూతురు గీర్వాణి యాడికి నెం.1 ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 24 , 2026 | 11:51 PM