Share News

CRICKET: విజేత రాయలచెరువు జట్టు

ABN , Publish Date - May 25 , 2026 | 11:58 PM

మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి.

CRICKET: విజేత రాయలచెరువు జట్టు
Rayalacheru team receiving the winner trophy

యాడికి, మే 25(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో సోమవారం ఉత్కంఠ భరితంగా సాగిన యాడికి ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ లీగ్‌ పోటీల్లో రాయలచెరువు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి జన్మదినాల వేడుకలను పురస్కరించుకొని యాడికి ప్రీమియర్‌లీగ్‌ నిర్వహించారు. పదిరోజులుగా పోటీలు జరిగాయి. సోమవారం ఉత్కంఠభరితం గా సాగిన ఫైనల్‌మ్యాచలో యాడికి, రా యలచెరువు జట్లు తలపడ్డాయి. రా యలచెరువు జట్టు విజేతగా, యాడికి జ ట్టు రన్నర్‌గా నిలిచాయి. విజేత రాయల చెరువు జట్టుకు రూ.30వేలు నగదు, ట్రోఫీ అందజేశారు. రన్నరప్‌ యాడికి జట్టుకు రూ.20వేలు, ట్రోఫీ అందజేశారు. మూడవస్థానంలో నిలిచిన యాడికి మరో జట్టుకు రూ.10 వేలు, ట్రోఫీని అందజే శారు. బహుమతుల ప్రదానోత్సవంలో సీఐ శ్రీనివాసులు, నిర్వాహకుడు విజన విశ్వం, బహుమతుల దాతలు దడియాల ఆదినారాయణ, గొర్తి రుద్రమనాయుడు, వెలిగండ్ల ఆదినారాయణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 25 , 2026 | 11:58 PM