Share News

MLA: ఒకటో తేది అంటే ఆనందం

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:06 AM

పట్టణంలోని శ్రీరాములపేటలో సోమవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పింఛనల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటోతేది అంటే ఆనందం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

MLA: ఒకటో తేది అంటే ఆనందం
MLA Ashmita Reddy distributing pension

-ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి

తాడిపత్రి, జూన 1(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీరాములపేటలో సోమవారం ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పింఛనల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటోతేది అంటే ఆనందం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇలా పంపిణీ చేసేవారు కాదని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నెలా ఒకటోతేది ఉదయం 6గంటలకు పంపిణీ చేయడం ఎంతో సంతోషం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆయన పట్టణం లోని శ్రీరాములపేట, సుంకులమ్మపాలెం, నంద్యాలరోడ్డులో పలు రేషనషాపులను తనిఖీ చేశారు. రేషన సక్రమంగా అందుతోందా, అన్ని వస్తువులు ఇస్తున్నారా అని లబ్ధిదారులతో ఆరాతీశారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అ లాగే నంద్యాలరోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మురుగు కాలువలపై బంకులు తదితర వాటిని మున్సిపల్‌ అధికారులు తొలగించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలిం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్య లు చేపట్టాలని అధికారులకు సూచించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 02 , 2026 | 12:06 AM