CAT: వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి
ABN , Publish Date - May 25 , 2026 | 12:05 AM
మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు.
పుట్లూరు, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓబులాపురం గ్రామశివారులో తోటలో పనులు చేసుకుంటుండగా రామాంజినమ్మ అనే వృద్ధురాలిపై అడవిపిల్లి దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం రామాంజినమ్మ మరో మహిళతో కలిసి మడుగుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తమ అరటితోటలో కలుపు పనులు చేసుకుంటున్నారు. అడవిపిల్లి దాడిచేయడంతో వృద్ధురాలి తల, చేతులు, కాళ్లు, శరీరంపై గాయాలయ్యాయి. తనచేతిలో ఉన్న కట్టెతో ప్రతిదాడిచేసి పిల్లిని మరో మహిళ సాయంతో చంపేశారు. విషయం తెలుసుకున్న వృద్ధురాలి కుమారులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....