Home » Suryakumar Yadav
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది.అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పుడు తన భార్య దేవిషా శెట్టి ఇచ్చిన సలహా వల్లే తిరగి ఫామ్ అందుకున్నానని సూర్య చెప్పుకొచ్చాడు.
రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు. 37 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. 468 రోజులు, 24 ఇన్నింగ్స్ తర్వాత సూర్య హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో సూర్య చక్కగా బ్యాటింగ్ చేశాడని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొనియాడాడు.
న్యూజిలాండ్‌తో రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 15.2 ఓవర్లలోనే ఆటను ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది.
రాయ్‌పుర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 76 పరుగులతో చెలరేగి ఆడాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ మాట్లాడాడు. తన ప్రశ్నలన్నింటికీ సమాధానం పరుగులే అని చెప్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నిర్ణయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాట్లాడాడు.
నేటి నుంచి న్యూజిలాండ్-భారత జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సూర్యకు ఓ కీలక సూచన చేశాడు.
టీమిండియా టీ20 కెప్టెన్, స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ సూర్యకు ఓ సలహా ఇచ్చాడు. ఔట్ అవ్వడం గురించే కాకుండా పరుగులు రాబట్టడం గురించి ఆలోచించాలని తెలిపాడు.