Irfan Pathan: జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:21 AM
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇది జట్టుకు మంచి సంకేతాలు కావని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచులు ముగిసిన విషయం తెలిసిందే. 1-1 తేడాతో ఇరు జట్లు సమంగా కొనసాగుతున్నాయి. కానీ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై అంతటా ఆందోళన నెలకొంది. గత కొద్ది రోజులుగా ఫామ్ లేమితో పేలవ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించాడు.
‘శుభ్‌మన్ గిల్(Shubman Gill) రెండో టీ20లో ఓ అద్భుతమైన బంతికి ఔటయ్యాడు. నిజానికి అతడు ఫామ్‌లో ఉండి ఉంటే ఆ బాల్‌ను చాలా తెలివిగా ఆడేవాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విషయానికొస్తే.. తన ఆఫ్‌సైడ్ ఆట మీద దృష్టి పెట్టాలి. ఔటైనప్పుడు అసలు పొజిషనల్‌లోనే లేడు. గిల్ బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడం టీమిండియాకు మంచి సంకేతం కాదు. అది అతడితో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ మీద కూడా ఒత్తిడిని పెంచుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. జట్టులోకి సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయితే అతడిని తీసుకొచ్చినా వెంటనే ఆశించిన ఫలితం అయితే రాకపోవచ్చు’ అని ఇర్ఫాన్ విశ్లేషించాడు.
ఒత్తిడిలో సూర్య..
‘కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అతడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. టీ20 ప్రపంచ కప్ వరకు సూర్య ఫామ్ అందుకోవాలి. సరైన బ్యాటింగ్ ఆర్డర్‌లో రావాలి. షాట్ సెలక్షన్ సరిగ్గా ఉండాలి.సూర్య.. నేరుగా వస్తున్న బంతుల్ని కూడా లెగ్‌సైడ్ ఆడే ప్రయత్నంలో ఔట్ అవుతున్నాడు. ఆ విషయం మీద అతడు దృష్టి సారించాలి. ఎప్పుడైతే బ్యాటర్ ఫామ్‌లో ఉండరో.. అప్పుడు అతడు ఆఫ్‌సైడ్, నేరుగా బంతిని ఆడే ప్రయత్నం చేయాలి’ అని సూర్యకుమార్ యాదవ్‌కు ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు.
ఇవీ చదవండి:
మీడియా హక్కులు యాథాతథమే.. స్పష్టం చేసిన ఐసీసీ, జియోస్టార్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!