Arshdeep Singh: మళ్లీ అలా జరగకుండా చూసుకుంటా: అర్ష్‌దీప్ సింగ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:37 PM
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. యువ పేసర్ అర్ష్‌దీప్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఓ వికెట్ విషయంలో సూర్యకుమార్ లేట్‌గా రివ్యూ తీసుకోవడంపై అర్ష్‌దీప్ తాజాగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 2 వికెట్లు తీసి కేవలం 13 పరుగులే ఇచ్చాడు. రెండో టీ20లో 9 వైడ్లు వేసి విమర్శలు అందుకున్న అర్ష్‌దీప్(Arshdeep Singh).. తిరిగి పుంజుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తాజాగా తన బౌలింగ్ ప్రదర్శనపై, రీజా హెండ్రిక్స్ ఎల్‌బీడబ్ల్యూ విషయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డీఆర్‌ఎస్ ఆలస్యంగా తీసుకోవడంపై స్పందించాడు.
‘నాలో ఏ మార్పు లేదు. నా నైపుణ్యంపై నమ్మకం ఉంచి బౌలింగ్ చేశా. అక్కడి వాతావరణం బౌలింగ్‌కు అనుకూలించింది. సరైనచోట బంతులు వేసి వికెట్లు రాబట్టాను. ఒక్కోసారి అనుకున్నవిధంగా బౌలింగ్ చేయలేకపోవచ్చు. ఆ తర్వాత పుంజుకోవడం చాలా బాగుంటుంది’ అని అర్ష్‌దీప్ అన్నాడు.
రీజాను ఎల్‌బీడబ్ల్యూ చేసిన విషయంలో రివ్యూ తీసుకోవడంపై అర్ష్‌దీప్ మాట్లాడాడు. ‘బంతి ప్యాడ్‌ను తాకినప్పుడే ఔట్ అని అనుకున్నా. కీపర్ జితేశ్ చెప్పాక నిర్ధారించుకున్నా. డీఆర్‌ఎస్‌కు వెళ్తామని నాకు తెలుసు. అయితే, రివ్యూ తీసుకోవడానికి కెప్టెన్ సూర్య చాలా సమయం తీసుకున్నారు. అందుకే చివరి క్షణంలో రివ్యూ కోరారు. బౌలర్‌గా అవకాశమున్న ప్రతిసారీ రివ్యూ కోరుకుంటాం. అయితే, బంతి ప్యాడ్‌కు రెండుసార్లు తాకినట్లు అనిపించింది. దీంతో సందేహపడ్డా. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతా’ అని అర్ష్‌దీప్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు