Home » Supreme Court
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్‌ల సంరక్షణపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సి ఉండగా, 15 రోజులు మాత్రమే ఎందుకు ఉంచుతున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇల్లు కొనేవారికి బ్రోచర్‌లో చూపించిన ప్లాన్‌ను, హామీలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవి కేవలం మార్కెటింగ్‌లో భాగంగా ఇచ్చిన ప్రకటనలని చెప్పి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది.
లా విద్యార్థుల ప్రవర్తనను నియంత్రించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ)కుగానీ, రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకుగానీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విద్యార్థులు చదువుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు మాత్రమే ఆ అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నాటి వాన్‌పిక్ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో రస్ అల్ ఖైమా ఇన్వె్‌స్టమెంట్ అథారిటీ (రాకియా) పేరు మీద మరో రూ.200 కోట్లను అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌గా జమచేయాలని ఆయనను, మరో నాలుగు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల క్రమంలో విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి.
ఏపీ మద్యం రవాణా కేసులో రాజ్ కసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డిల అరెస్టుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇద్దరి అరెస్టులకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తప్పనిసరిగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు స్వీకరించలేదు.
సెప్టెంబర్ 5న ఢిల్లీలో జరగనున్న CJP ఇండియా గేట్ మార్చ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలోనే వ్యవహరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్న ధర్మాసనం.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
సహోద్యోగినిపై లైంగికదాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తరుణ్ తేజ్‌పాల్ రెండు వారాల్లో లొంగిపోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.