AP Corruption Cases: ఏపీ అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హైకోర్టు ఆదేశం రద్దు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 07:18 PM
ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనవరి 8: ఆంధ్రప్రదేశ్‌లో 2016–2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల (డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్) అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఏపీ విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(CIU)ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా అధికారికంగా నోటిఫై చేయలేదన్న టెక్నికల్ కారణంతో హైకోర్టు ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన కేసులో హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇలాంటి టెక్నికల్ కారణాలతో దేశవ్యాప్తంగా అనేక అవినీతి కేసులు హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ తీర్పు మైలురాయిగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
Read Latest Telangana News And Telugu News