Psycho Attack: ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
ABN , Publish Date - Jan 08 , 2026 | 02:38 PM
మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ సైకో వీరంగంతో ఆస్పత్రిలో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు.
మహబూబాబాద్, జనవరి 8: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం సృష్టించాడు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కత్తులతో హల్‌చల్ చేశాడు. ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, రోగులను కత్తితో పొడుస్తానని సైకో బెదిరించాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో అనేక మంది రోగులు పరుగులు పెట్టారు. అనంతరం ఆ వ్యక్తి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి లోపలి నుంచి తలుపులు వేసుకుని తన గొంతును తానే కోసుకున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి అతన్ని బంధించారు. తీవ్ర రక్తస్రావం అయిన అతడికి వెంటనే చికిత్స అందించారు. సైకోను పట్టుకోవడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆసుపత్రి పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?
మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్
Read Latest Telangana News And Telugu News