Home » Supreme Court
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్‌పై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
14 ఏళ్ల బాలికకు సంబంధించి 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ (AIIMS) వైద్యులు సుప్రీంకోర్టులో 'క్యూరేటివ్ పిటిషన్' దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఆయనకు ప్రస్తుతానికి ఊరట లభించలేదు.
మహిళా న్యాయవాదిపై భర్త కత్తితో దాడి చేసిన ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది ప్రారంభంలో కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవడంపై సుప్రీంకోర్టు బుధవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు మధ్యలోకి ముఖ్యమంత్రి చొరబడి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టటం సరికాదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో జరుగుతున్న మతపరమైన హక్కులు, ఆచారాలు, ప్రభుత్వ జోక్యంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శబరిమల కేసు సంబంధిత విచారణలో ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.