Supreme Court: తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించండి.. ఈసీకి సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Aug 06 , 2025 | 04:22 PM
బీహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌ను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్‌జీఓ గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా అనంతరం మరోసారి కోర్టును అశ్రయించింది.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) జరిపిన ఎన్నికల కమిషన్ (EC) ఈనెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 65 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను ఆగస్టు 9వ తేదీలోగా తమకు సమర్పించాలని ఆదేశించింది.
బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌ను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఎన్‌జీఓ గతంలో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితా అనంతరం మరోసారి కోర్టును అశ్రయించింది. రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను ఇచ్చినప్పటికీ ఓటర్ల తొలగింపునకు కారణాలు చెప్పలేదని ఎన్‌జీపీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తమ వాదనలు వినిపించారు.
దీనిపై న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, తొలగించిన ఓటర్ల జాబితా వివరాలు ఇప్పటికే రాజకీయ పార్టీలకు ఇచ్చినందున ఆ వివరాలను ఎన్‌జీవోకు కూడా అందించాలని ఈసీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ప్రస్తుతం జాబితా వివరాలను అందిస్తు్ందని, ఆ తర్వాత కారణాలను వివరిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి