Home » Student
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. ఈ పేరు చెబితే ఒకటి కాదు.. మేధావి, శాస్త్రవేత్త, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్, స్ఫూర్తి ప్రదాత, నిరాండబరత, ఇలా ఎన్నెన్నో గుర్తొస్తాయి. విద్యార్థుల ప్రగతి కోసం నిత్యం పరితపించే ఆయన.. వారి కోసం పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని అద్భుత సూక్తులు..
ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్‌కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటిపై మనం పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ కొనసాగుతోంది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్ చేయించి మంచిగా చదవించండంటూ తల్లిదండుల్రకు సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రముఖ బౌద్ధ సంస్థ బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్ నగరం కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పేద పిల్లలకు బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేసింది.
Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్‌తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.
సైబర్ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ - పంచాయతీరాజ్‘(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీటీడీఎమ్), ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నారు.
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్‌ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.