Engineering Student Dies: ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్య...ర్యాగింగ్ కారణమా
ABN , Publish Date - Sep 22 , 2025 | 08:19 AM
దాదాపు అనేక కాలేజీలలో ర్యాగింగ్ విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కానీ ఇదే విషయంలో తాజాగా జరిగిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యువ ఇంజినీరింగ్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ర్యాగింగ్ కారణంగా సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కాలేజీల్లో ర్యాగింగ్‌ను నిరోధించేందుకు కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఓ యువ ఇంజినీరింగ్ విద్యార్థి, జాదవ్ సాయి తేజ, ర్యాగింగ్ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం (Engineering Student Dies) చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ దారుణ ఘటన వెనుక ర్యాగింగ్ ఉందని సూచిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా మేడిపల్లి (Medipally suicide) పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న జాదవ్ సాయి తేజ్ (19) మధు బాయ్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని మరణించాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన ఈ విద్యార్థి, సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు గురైనట్లు సమాచారం. సీనియర్లు అతన్ని మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్‌కు తీసుకెళ్లారు. అక్కడ భారీ బిల్ వచ్చిన తర్వాత, బిల్ కట్టమని మరింత ఒత్తిడి చేశారు.
ఈ ర్యాగింగ్ వల్ల తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న సాయి తేజ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చరీకి తరలించారు. ర్యాగింగ్ కారణమా లేక వేరే కారణాలా అని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కాలేజీల్లో భయం, ఒత్తిడి నుంచి విద్యార్థులను కాపాడేందుకు చట్టాలు పనిచేయడం లేదా? ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులను, కాలేజ్ యాజమాన్యాన్ని మళ్లీ ఆలోచింపజేస్తోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి