Home » SRH
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ బౌలర్, ఎస్ఆర్‌హెచ్ కీలక ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. అరంగేట్రంలోనే ప్రఫుల్ 4, సకిబ్ హుస్సేన్ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఐపీఎల్ 2026లో మరో కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ సత్తా చాటింది. అరంగేట్రంలో ప్రఫుల్ హెంగే, సకిబ్ హుస్సేన్ చెలరేగిన వేళ.. ఆర్ఆర్ 159 పరుగులకే ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఎట్టకేలకు సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్‌లో ఓటమి లేకుండా దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు ముకుతాడు వేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.
న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చేసిన పనికి గ్యాలరీలో ఉన్న అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
క్రికెట్‌లో కొనసాగాలంటే ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందేనని టీమిండియా వెటరన్ బౌలర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.