Share News

సన్ రైజర్స్ మ్యాచ్‌లో చేతబడి కలకలం.. అసలు ఏం జరిగిదంటే?

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:23 PM

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో ఉన్న ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయలతో మంత్రాలు చదువుతున్నట్లు ఉన్న వీడియో నెట్టింట అవుతోంది.

సన్ రైజర్స్ మ్యాచ్‌లో చేతబడి కలకలం.. అసలు ఏం జరిగిదంటే?
black magic viral video IPL

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న(శనివారం) స‌న్‌ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ గెలిచింది. నిన్నటి మ్యాచ్‍లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఇది ఇలా ఉంటే.. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్యాలరీలో ఓ వ్యక్తి చేతబడి చేసినట్లు ఉండే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియో ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకున్న్నాడు. అంతేకాక ఓమ్ భూమ్ భుష్ అన్నట్లుగా మంత్రాలు చదుతున్నాడు. అతడు మంత్రలు చదివిన వెంట‌నే శివ‌మ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో స‌ద‌రు అభిమాని సంబరాల్లో మునిగితేలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.


బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక చెన్నై ఓటమికి సదరు వ్యక్తి చేతబడే కారణం అంటు మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రాల‌కు చింతకాయ‌లు రాల‌వంటూ మ‌రి కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్‌ హెడ్‌ సైతం నెట్టింట్లో వైరలవుతుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలో తొలిసారి.. ఇషాన్ కిషన్ ఖాతాలో అరుదైన రికార్డు!

సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు

Updated Date - Apr 19 , 2026 | 03:01 PM