సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. సీఎస్కే చెత్త రికార్డు నమోదు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:43 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (శనివారం) ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో చెన్నై జట్టు పలు చెత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ 2019 తర్వాత ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా 180 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించలేదు. 14 ప్రయత్నాల్లో ఓటమినే చవిచూసింది. చెన్నై జట్టు చివరిసారిగా 180 ప్లస్ టార్గెట్‌ను 2018లో ఇదే సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఛేదించింది. అంతేకాక మరో చెత్త రికార్డును సీఎస్కే కొనసాగించింది. నిన్నటి మ్యాచ్‌తో కలిపి ఉప్పల్ వేదికపై సీఎస్కే ఎనిమిదేళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.
ఉప్పల్ వేదికపై చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యంత చెత్త రికార్డు ఉంది. అలానే ఇటీవలి టీ20లలో 200 పరుగులకు పైగా స్కోర్ చేసినప్పటికీ అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. నిన్నటి పరాజయం తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో స్థానానికి చేరింది.
ఇవి కూడా చదవండి:
మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్
ఆ ఓవర్లే మా కొంప ముంచాయి: సీఎస్కే కెప్టెన్ రుతురాజ్