Share News

మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:00 AM

ఐపీఎల్2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. తమ లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తగ్గినా.. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు.

మా విజయానికి కారణం వారే: ఇషాన్ కిషన్
Ishan Kishan reaction

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. తమ లక్ష్యానికి 30 నుంచి 40 పరుగులు తగ్గినా.. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అన్నాడు.


ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ... ' మా బౌలర్లు అదరగొట్టారు. యువ బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తుంటే కెప్టెన్‌‌కు కలిగే అనుభూతే వేరేగా ఉంటుంది. అందుకే ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చింది. మా యంగ్ బౌలర్లు స్వయంగా తమ సొంత వ్యూహాలతో మైదానంలోకి వస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేస్తున్నారు. దీని వల్ల ఫీల్డింగ్ సెట్ చేయడంలో కెప్టెన్‌‌గా నాపై ఒత్తిడి చాలా తగ్గుతుంది. ఈ మ్యాచ్‌లో వారు బౌలింగ్ చేసిన తీరు అద్భుతం' అని బౌలర్లపై ఇషాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.


'అభిషేక్ తక్కువ సమయమే ఉన్నప్పటికీ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. సాధారణంగా మేం 220 లేదా 230 పరుగులు చేసినప్పుడల్లా టాప్-3 బ్యాటర్లలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధిస్తారు. ఈ మ్యాచ్‌లో ఆ భారీ ఇన్నింగ్స్ మిస్ అయ్యాం. మాకున్న ఈ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి మేం కచ్చితంగా ఒక 30 నుంచి 40 పరుగులు తక్కువ చేశాం. అయితే ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. షాట్ సెలక్షన్ ఎంపిక విషయంలో మేం ఇంకా మెరుగవ్వాలి. పాయింట్స్ టేబుల్‌ను మేం పట్టించుకోవడం లేదు. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని ఇషాన్ కిషన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఆ ఓవర్లే మా కొంప ముంచాయి: సీఎస్కే కెప్టెన్ రుతురాజ్

సొంత రికార్డును బద్దలుగొట్టిన అభిషేక్ శర్మ.. చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్..

Updated Date - Apr 19 , 2026 | 11:07 AM