మరికాసేపట్లో ఎస్ఆర్‌హెచ్‌తో చెన్నై మ్యాచ్ .. స్టార్ బౌలర్ దూరం
ABN , Publish Date - Apr 18 , 2026 | 05:52 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ పేసర్ల మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో ఎస్ఆర్‌హెచ్ జోరుమీద ఉంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్(SRH vs CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. యువ పేసర్ల మెరుపులు, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌తో ఎస్ఆర్‌హెచ్ జట్టు జోరుమీద ఉంది. అలానే వరుసగా రెండు విజయాలతో సీఎస్కే ఫామ్‌లోకి వచ్చింది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా ఉంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఐదు మ్యాచుల్లో రెండు మ్యాచులు గెలిచాయి.
హైదరాబాద్ చేరుకున్న చెన్నై స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో గాయంతో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ధోని ఆడలేదు. ఇవాళ్టి మ్యాచులో అయినా ధోనీ ఆడుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం నుంచి కోలుకుని ఎస్ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఉప్పల్ స్టేడియం ఫ్లాట్ పిచ్ కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైన్ అప్ స్ట్రాంగ్‌గా ఉండగా... సీఎస్కేలో సంజు శాంసన్, ఆయుష్ మాత్రే మంచి ఫామ్‌లో ఉన్నారు.
ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్‌లో జరిగిన రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు భావిస్తున్నారు. యువ ఆటగాళ్లు ప్రఫుల్, సాకిబ్ హుస్సేన్, హర్ష్ దూబే, శివాంగ్‌తో కలిసిన బౌలింగ్ యూనిట్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనుంది. మరోవైపు గాయం కారణంగా ఇవాళ్టి మ్యాచ్‌కి చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ ఖలీల్ అహ్మద్ దూరం కానున్నాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!