ఔటయ్యాననే కోపంతో షాహీన్ అఫ్రిది చేసిన పనికి అందరూ షాక్!
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:30 PM
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు ఏదో చేద్దామని భావించి.. ముందుగా బ్యాటింగ్ వచ్చి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత..
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 2026లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు ఏదో చేద్దామని భావించి.. ముందుగా బ్యాటింగ్ వచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో పరువు పోయిందని భావించిన అఫ్రిది సహనం కోల్పోయి.. బ్యాట్‌తో బౌండరీ లైన్ వద్ద ఉన్న టైర్లను బలంగా కొట్టాడు. ఈ ఘటన ప్రస్తుతం పీఎస్ఎల్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
పీఎస్ఎల్ 2026 భాగంగా నిన్న(శుక్రవారం) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లాహోర్ ఖలందర్స్ ఓటమి పాలైంది. షాహీన్ షా అఫ్రిది(Shaheen Shah Afridi) కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టుకు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 19.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. లాహోర్ ఇన్నింగ్స్‌లో హసీబుల్లా ఖాన్( 33) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది తన సహనాన్ని కోల్పోయాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ల ధాటికి 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జట్టును గట్టేక్కించేందుకు అఫ్రిది తనను తానుగా ప్రమోట్ చేసుకుని ముందుగా బ్యాటింగ్‌కు వచ్చాడు.
స్టార్ ఆల్ రౌండర్లు సికిందర్ రజా, డానియల్ సామ్స్‌ను కాదని అఫ్రిది ముందుగా బ్యాటింగ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే షాహీన్ తాను ఆడిన తొలి బంతికే స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో గోల్డెన్ డకౌటైన బాధలో షాహీన్ అసహనానికి గురయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న టైర్లను బ్యాట్‌తో బలంగా బాదాడు. అంతేకాకుండా మెట్లకు కూడా తన బ్యాట్‌ను బలంగా కొడుతూ ముందుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఏదో పెద్ద ఘనతను చేజార్చుకున్నట్లుగా ఇంత ఓవరాక్షన్ ఎందుకంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!