ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Apr 18 , 2026 | 02:48 PM
జర్మనీ మోడల్ లిజ్లాజ్ ఇన్‌స్టా పోస్ట్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిజ్లాజ్ ఈ అంశంపై స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏది చేసినా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా కోహ్లీ జర్మనీ మోడల్ లిజ్లాజ్ పోస్ట్‌కు లైక్ కొట్టడంపై రెండురోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. విరాట్ లైక్ వల్ల సదరు మోడల్ ఓవర్‌నైట్‌లో పాపులరైంది. ఆమె పోస్ట్‌కు లైక్ కొట్టడంపై నెటిజన్లు విరాట్‌ను ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ విషయంపై లిజ్లాజ్ స్పందించింది. అనుకోకుండా పాపులర్ అయినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ.. తర్వాతా చాలా బాధగా అనిపించిందని వెల్లడించింది.
‘విరాట్ కోహ్లీ నా ఫొటోకు లైక్ చేసినప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఆ తర్వాత ఆ పోస్ట్‌ను ఆయన అన్‌లైక్ చేశారు. అనుకోకుండా ఓవర్‌నైట్‌లో పాపులర్ అయ్యాను. దానికి ఆనందంగానే ఉంది కానీ తర్వాత చాలా బాధగా అనిపించింది. ఈ ఒక్క లైక్ సోషల్ మీడియాలో ఇంత పెద్ద స్టోరీ అవుతుందని ఊహించలేదు. కోహ్లీని ఇంతగా ట్రోల్ చేస్తారనుకోలేదు. ఆ లైక్ వెనక అతనికి దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏదేమైనా నా ఫొటోని స్టార్ క్రికెటర్ లైక్ చేసినందుకు గర్వంగా అనిపించింది’ అని లిజ్లాజ్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్
చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్