Share News

చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:26 AM

ఐపీఎల్‌ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

 చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
Varun Chakravarti

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. దీంతో ఐదు ఓటములను కేకేఆర్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ప్లే ఆఫ్ ఆశలు సంక్లీష్టంగా మారాయి. ఇక నిన్నటి మ్యాచ్ ఓటమిలోనూ ఆ జట్టు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarti) చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చారిత్రక ఘనత సాధించాడు.


గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు సాధించాడు. అందులో తొలి వికెట్‌ తీసిన క్రమంలోనే 100 వికెట్ల ఘనత అందుకున్నాడు. 9.1 ఓవర్లో తీసిన జోస్ బట్లర్‌ వికెట్‌ వరుణ్‌కు ఐపీఎల్‌లో 100వ వికెట్‌. వరుణ్‌ కంటే ముందు కేకేఆర్‌ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్లుగా సునీల్‌ నరైన్‌ (214), ఆండ్రీ రసెల్‌ (124) ఉన్నారు. వీరిద్దరూ విదేశీ ప్లేయర్ల కాగా వరుణ్ చక్రవర్తి తొలి ఇండియన్ ప్లేయర్ కావడం గమన్హారం. వరుణ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో (పంజాబ్‌, కేకేఆర్‌ తరఫున) ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడి102 వికెట్లు తీశాడు. ఇందులో 2019లో తన తొలి సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున తీసిన ఒక వికెట్ కూడా ఉంది.


వరుణ్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పంజాబ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌తో కలిసి సంయుక్తంగా 28వ స్థానంలో ఉన్నాడు. ఇక కేకేఆర్ తరఫున 196 వికెట్లతో నరైన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు, ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి అత్యధిక వికెట్ల రికార్డు కూడా ఇదే కావడం గమనార్హం. మొత్తంగా గుజరాత్ మ్యాచ్ లో వరుణ్ చారిత్రాత్మక రికార్డును నమోదు చేసినా.. కేకేఆర్‌ ఓడిపోవడంతో అది మరుగునపడిపోయింది.


ఇవి కూడా చదవండి:

విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన

ఐపీఎల్‌ మ్యాచ్‌..ఉప్పల్‌ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Updated Date - Apr 18 , 2026 | 12:10 PM