సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:11 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన తమ ప్లేయర్ డేవిడ్ పేన్ స్థానంలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీకి తీసుకుంది. గతంలో ఈ స్టార్ బౌలర్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం గెరాల్డ్ కొయెట్జీకి జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ గాయపడిన ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ పేన్ స్థానంలో కొయెట్జీని జట్టులోకి తీసుకుంది. గెరాల్డ్ కోయెట్జీ జట్టుతో చేరడం ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ విభాగానికి కొండంత అండగా మారింది.
గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన కొయెట్జీని ఈ సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అయితే సీజన్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్ల మొత్తం వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఎస్ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో తొలుత జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పేన్‌ను తీసుకుంది. డేవిడ్ పేన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు తీయగా.. దురదృష్టవశాత్తు గాయపడ్డాడు. దీంతో డేవిడ్ పిన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గెరాల్డ్ కోయెట్జీని ఎంపిక చేసినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన గెరాల్డ్ కోయెట్జీ 15 వికెట్లు సాధించాడు. దక్షిణాప్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడి మొత్తం 67 వికెట్లు సాధించాడు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న గెరాల్డ్ కోయెట్జీ రాక సన్ రైజర్స్‌లో కొత్త జోష్ నింపింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్‌లో చాలా బలహీనంగా ఉంది. బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్నా బౌలింగ్‌లో తేలిపోవడంతో గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనూ ఓడిన సంగతి తెలిసిందే. కొయెట్జీ రాక ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కష్టాలను తీరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్
విరాట్, రోహిత్‌లను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన