Share News

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ABN , Publish Date - Apr 18 , 2026 | 02:32 PM

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ వదలి, పీఎల్ఎస్‌లో ఆడటానికి గల కారణాలను తాజాగా వెల్లడించాడు.

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
Moeen Ali

స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్స్‌లో ఐపీఎల్ ఒకటి. అలాంటి క్యాచ్ రిచ్ లీగ్ కు వివిధ కారణాలతో కొందరు ప్లేయర్లు దూరంగా ఉంటుంటారు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కూడా ఆ జాబితాలో చేరాడు. ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్‌కు అతడు దూరంగా ఉండి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చేరాడు. అక్కడకరాచీ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని.. తాను ఐపీఎల్‌ను కాదని పీఎస్ఎల్ ఆడటం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు.


‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్‌ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్‌ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను. నేను పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎంచుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఐపీఎల్ సుదీర్ఘంగా సాగుతోంది. అదే పీఎస్ఎల్ తక్కువ రోజుల్లో ముగిసే టోర్నీ. ఇది నా కుటుంబంతో గడపడానికి, అలాగే నా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి బాగా ఉపయోగ పడుతుంది. పీఎస్ఎల్ షెడ్యూల్ నాకు సరిగ్గా సరిపోతుంది" అని అన్నాడు.


'గతేడాది నేను ఐపీఎల్‌లో ఆడాను. అయితే సగం మ్యాచ్‌లలో కూడా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. రెండుసార్లు మాత్రం నేను బ్యాటింగ్‌ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్‌ చేయడం ఇష్టం. నా కెరీర్‌ చివరి దశలోనూ ఎక్కువగా బ్యాటింగ్‌ చేయాలని కోరుకుంటున్నా. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్‌ఎల్‌ ఆడాలని అనుకున్నా. కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ షెడ్యూల్‌​ క్లాష్‌ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యాను’’ అని మొయిన్‌ అలీ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ బౌలర్

చరిత్ర సృష్టించిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

Updated Date - Apr 18 , 2026 | 02:39 PM