మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 01:36 PM
లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం నిరాశ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు. బిల్లును వ్యతిరేకించిన విపక్ష పార్టీలు.. ప్రజలకు, మహిళలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు పెద్ద తప్పు చేశాయని.. అందుకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని వ్యాఖ్యానించారు.
'మహిళల హక్కులను, గౌరవాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న ఆమోదయోగ్యమైన చర్యలకు విపక్షాలు అడ్డంకులు సృష్టించడం చాలాకాలంగా కనిపిస్తోంది. అలా చేసిన వారు ఇప్పుడు సమాజానికి, మహిళలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా బిల్లును వ్యతిరేకించిన విపక్షాల చర్యలు తప్పు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. ఈ బిల్లును అంగీకరించనివారు తమ తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు' అని మోదీ చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఇతర కేబినెట్ సభ్యులు కూడా మోదీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.
ఇవీ చదవండి:
విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక
అజిత్ ఢోబాల్, జైశంకర్‌తో ఉక్రెయిన్ ఉన్నతాధికారి భేటీ