Share News

విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:10 PM

డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విపక్షాలు ఐక్యంగా పోరాడి బీజేపీని అడ్డుకున్నాయని ఆమె తెలిపారు.

విపక్షాలు ఐక్యంగా ఉండి బీజేపీ కుట్రలను అడ్డుకున్నాయి: ప్రియాంక
Priyanka Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కేంద ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర దాగుందని.. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకే ఆ పార్టీ నేతలు ఈ రకమైన కుట్రలు పనున్నతున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ఓడించాయని ఆమె అన్నారు.


131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక వ్యూహాత్మక రాజకీయ కుట్ర ఉందని ప్రియాంక తెలిపారు. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు ఈ బిల్లును వాడుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుకునే ప్రయత్నం చేసిందని.. విపక్షాల ఐక్యతతో ఇది వీగిపోవడంతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. 'ఎన్డీఏ హయాంలో జరిగిన ఆకృత్యాలను ప్రజలు చూశారు. 2023 నాటి బిల్లును మళ్లీ తీసుకొచ్చి సభలో పెట్టండి. ఎవరు మహిళా వ్యతిరేకి అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఇతర అంశాలతో మహిళా బిల్లును కలపొద్దు. మహిళలకు తమ హక్కులను వెంటనే కల్పించాలి' అని ప్రియాంక చెప్పారు.


మహిళా బిల్లును ఇతర అంశాలతో ముడిపెట్టకుండా వేరుగా చర్చించుకోవాలని, ఈ విషయంలో మహిళల హక్కులపై బీజేపీ సుస్థిర నిర్ణయం తీసుకోవాలని ప్రియాంక సూచించారు. ప్రజాస్వామ్యం, మహిళా హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా.. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.


ఇవీ చదవండి:

30 సంవత్సరాలుగా అవరోధాలే!

దక్షిణాది దెబ్బ!

Updated Date - Apr 18 , 2026 | 01:15 PM