Share News

విచిత్రంగా ప్రవర్తించిన జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:20 PM

టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐపీఎల్ 2026 సీజన్ అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.

విచిత్రంగా ప్రవర్తించిన జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్
Jasprit Bumrah

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ఐపీఎల్2026 సీజన్ అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్ కేకేఆర్‌పై తప్ప.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. చివరగా పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాకు సంబంధిచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన బుమ్రా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో బుమ్రా ప్రవర్తించిన తీరుతో అతడి మానసిక స్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వీడియోలో బుమ్రా గట్టిగా అరుస్తూ కనిపించాడు. చాలా సేపు మైదానంలో తీవ్ర అసహనంగా కనిపించాడు. ఆ తర్వాత గ్రౌండ్‌లో ఉన్న బౌలింగ్ మార్కర్‌ను తీసి.. దూరంగా విసిరేశాడు. కాసేపు అక్కడే తిరుగుతూ.. మరో చోట ఉన్న బౌలింగ్ మార్కర్‌ను కాలితో గట్టిగా తన్నే ప్రయత్నం చేశాడు. బుమ్రా తీవ్ర నిరాశలో ఉన్నాడని, ఆట కంటే అతడి ఆరోగ్యం ముఖ్యమంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో ముంబై ఓడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్లలో కేవలం 35 పరుగులు ఇచ్చాడు. అయితే మరోసారి వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే బుమ్రాను తీవ్ర నిరాశలో చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.


ఇవి కూడా చదవండి:

ఔటయ్యాననే కోపంతో షాహీన్ అఫ్రిది చేసిన పనికి అందరూ షాక్!

సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Updated Date - Apr 18 , 2026 | 04:49 PM