రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:03 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎజెండా ఏమిటనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి తొలిసారి ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎజెండా ఏమిటనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి తొలిసారి ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
శనివారం ఉదయం మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లును ఓడించి ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పుచేశాయని, అందుకు వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఓడించిన విపక్షాలను దేశ మహిళలు క్షమించరని వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాగా, 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. 543 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు వీగిపోవడంతో తక్కిన రెండు బిల్లులైన డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి: మోదీ
డీలిమిటేషన్‌ను అందుకే అడ్డుకున్నాం: రాహుల్ గాంధీ